నా దేశం

నేటి ప్రపంచం
ఒక విష వలయం.
ప్రేమ దయ కరుణలకుఅతీతం
మానవుని అభ్యుధయనికి పెద్ద అవరోధం

ప్రగతి పేరుతో
దోచుకుంటారు రాజకీయ నాయకులు
వారికే చెబుతారు జోహార్లు ప్రజలందరూ
ప్రజాపాలకులు ప్రజలని పాలించి
ధనముని దోచే దొంగలు
కానీ వారిని ఎదురుంచుట ఎవరి తరము?

అమ్మని దోచుకుంటున్న గుండాలను
కొడుకు చూచి
తన బ్రతుకు దారి కొరకు పారిపోయి
వేరే వారిని దోచుకోవటం ఇప్పటి సాంప్రదాయం.

ప్రేమ పేరుతో మోసాలు
బ్రతుకుతో చెలగాట ములు.
విప్లవ వీరుల వీరత్వలు
పట్టపగలేశిరచ్చేధనములు

ఇదే ఈ నాటి నా దేశం
నా భారత దేశం!!!