నా సందేశం

ఆంగ్లేయుల నుండి విముక్తి
అయ్యింది ౬౮ సంవత్సరములు
కానీ ఇంకా దోచుకునే వారి నుండి
ఎప్పుడు కలుగుతుంది విముక్తి ?

అమ్మ నాన్నల కన్నా
అన్న దమ్ముల కన్నా
మించి ప్రేమించేది, ఆరాధించేది,
ప్ర్రాణలను అర్పించేది,
కేవలం ధనమునకు మాత్రమే.

అందుకే చెప్పాడు భతృహరీ
” ధనం మూలం జగత్” అని
అందుకే పాటిస్తారు మన సోదరులు
ఆది నిరూపించేందుకే

ఎక్కడ ఆ సస్యశామలం
ఎక్కడ ఆ స్వేచ్ఛ
ఎవరికి తెలుసు జాతీయ గీతం?
ఎవరికి గుర్తు ఉంది వందేమాతరం?
కలుషితమయ్యింది ఈ ప్రపంచం
పెంపొందించుకుంటుంది సినిమా జ్ఞానం

ధనం మీద మోజు వీవస్తృులను చేసి
యువకులను తప్పు దారి పట్టించే,
ఈ నా దేశం
ఎప్పుడు కలుగుతుంది జ్ఞానొదాయం ???
ఎప్పుడు అందుతుంది ఈ నా సందేశం ???